బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం జోరు అందుకున్నది. నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో పోటీలో ఉన్న పార్టీలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయాల్సి ఉన్నా, గత సంప్రదాయాలను గౌరవిస్తూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నది. అయితే, జనసేన తప్పుకోవడంతో బీజేపీ పోటీకి సిద్ధమైంది. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన పార్టీ బీజేపీకి ప్రచారం చేస్తుందా లేదా అనే అంశంపై నిన్నటి వరకు సందేహం ఉన్నది. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తులో ఉన్నామని, ధర్మాన్ని పాటిస్తామని, బీజేపీ విజయం కోసం పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారిపోయిందని, గుంతలు లేని రోడ్డు ఒక్కటి కూడా లేదని, రోడ్లపై తమ పోరాటం కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read: జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక: అవసరమైతే తప్పా బయటకు రావొద్దు…