కరోనా కాలంలో కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకున్నాం. రెండేళ్లుగా చాలా మంది ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నాయి. పిల్లలైతే ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చదువుతున్నారు. కరోనా సమయంలో చాలా మంది ఖైదీలను ప్రభుత్వాలు విడుదల చేశాయి. అలా విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ఉంటారు అని గ్యారెంటీ లేదు. అందుకే కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వర్క్‌ఫ్రమ్ హోమ్ మాదిరిగానే జైల్ ఫ్రమ్ హోమ్ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలియజేసింది. మూడేళ్ల శిక్ష పడిన ఖైదీలు జైలుకు వెళ్లకుండా ఇంటినుంచే ఆ శిక్షను అనుభవించవచ్చు. ఇంట్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు ప్రత్యేకమైన చిప్‌ను అమర్చుతారు. వారు ఇంట్లో ఖైదును అనుభవిస్తున్న సమయాన్ని అధికారులు జైలు జీవితం అనుభవిస్తున్నట్టుగా గుర్తిస్తారు. మూడేళ్ల వరకు శిక్ష పడిన ఖైదీలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
Read: తాలిబన్ ప్రభుత్వంలో అప్పుడే మొదలైన లుకలుకలు… అజ్ఙాతంలోకి కీలక నేత….
