NTV Telugu Site icon

నాగార్జున మూవీ మ్యూజియం

It’s my dream to build a museum for Telugu cinema says Akkineni Nagarjuna

అక్కినేని నాగార్జున ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇది సినిమా కాదు. మూవీ మ్యూజియం. దీనిని ఏర్పాటు చేయాలన్నది చిరకాలంగా నాగార్జునకు ఉన్న కల అట. సినిమాలు చేయటమే కాదు వాటిని భద్రంగా కాపాడుకోవడం కూడా బాధ్యత అంటున్నారు నాగ్. తను అలా టాలీవుడ్ కి సంబంధించిన అద్భుతమైన సినిమాలను భద్రపరచటమే కాదు వాటి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉండేలా డిజిటల్ మ్యూజియమ్ ఏర్పాటు చేయబోతున్నానంటున్నాడు. పక్కా ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నానని, ముందుగా తన తండ్రి ఎఎన్ఆర్ నటించిన సినిమాలను సేకరిస్తున్నట్లు చెబుతున్నాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఈ మ్యూజియమ్ ఏర్పాటు చేస్తానంటున్నాడు నాగ్. తెలుగుచిత్రపరిశ్రమ గొప్పదనాన్ని అందరికీ తెలియచేసేలా ఈ మ్యూజియమ్ ఉంటుందని, ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న నాగ్ కల నెరవేరాలని ఆశిద్దాం.