Site icon NTV Telugu

ఐసిస్ కీల‌క హెచ్చ‌రిక‌: వెతికి మ‌రీ చంపుతాం…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డ ప్ర‌జ‌ల జీవ‌నం అస్త‌వ్య‌స్తం అయింది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహారం లేక ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇది చాల‌ద‌న్నట్టు తాలిబ‌న్ల‌ను స్పూర్తిగా తీసుకొని మిగ‌తా ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘ‌న్‌లోని ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ షియా ముస్లీంల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న‌ది. కాంద‌హార్‌, కుందుజ్ ప్రావిన్స్‌లో షియా ముస్లీంలు ప్రార్థ‌న‌లు చేస్తున్న మ‌సీదుల‌పై దాడుల‌కు పాల్ప‌డింది. ఆ దాడుల్లో దాదాపుగా 160 మందికి పైగా ప్ర‌జ‌లు మృతి చెందారు. వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. షియా ముస్లీంలు ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తులు అని, వారు ఎక్క‌డున్నా వ‌దిలిపెట్టేది లేద‌ని, బాగ్దాద్ నుంచి ఖొర‌సాన్ వ‌ర‌కు ప్ర‌తి చోట షియా ముస్లీంల‌ను వ‌దిలేది లేద‌ని ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ హెచ్చ‌రించింది. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాతే ఆ దాడులు మ‌రింతగా పెరిగాయి. తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా ఆఫ్ఘ‌నిస్తాన్‌ను మార్చ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. కానీ, వారికి అనేక ఉగ్ర‌వాద‌సంస్థ‌లు ఇప్పుడు స‌వాల్ విసురుతున్నాయి.

Read: అంత‌రిక్షం నుంచి సుర‌క్షితంగా ల్యాండైన ది ఛాలెంజ్ చిత్ర యూనిట్‌…

Exit mobile version