Site icon NTV Telugu

అధికారుల నిర్లక్ష్యం.. ఇంటర్‌ విద్యార్ధి బలవన్మరణం

జ్యోతి రావు పూలే కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యం. సీనియర్ల బలవంతం ఓ విద్యార్థి పాలిట శాపంగా మారింది. ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని కరుణాపురంలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ హాస్టల్ లో పరకాల శాయంపేటకి చెందిన భరత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఇదే హాస్టల్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీనియర్స్ గుట్కా పాకెట్స్ తీస్కొని రమ్మని సోమవారం భరత్ పై ఒత్తిడి చేశారు.

గుట్కా ప్యాకెట్స్ తీసుకువచ్చిన సమయంలో భరత్ వాచ్ మెన్ కి కనపడడంతో భారత్ ని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో విషయం భరత్ తల్లి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఏంచేయాలో తెలీక భరత్ కాలేజి నుండి చెప్పకుండా వెళ్ళిపోయి ఇంటికి చేరుకున్నాడు. మనస్తాపంతో పరకాల శాయంపేటలోని తమ పొలం దగ్గర గడ్డి మందు తాగి ఇంటికి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతని మొహం చూసిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి పరకాలలోని హాస్పిటల్ లోచేర్చగా అప్పటికే సీరియస్ అయింది. దీంతో అతడిని వరంగల్ ఎంజీఎంకి తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించాడు.. కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యం తమ కుమారుడి చావుకు కారణం అయ్యిందని కన్నీరుమున్నీరు అవుతున్నారు భరత్ తల్లిదండ్రులు

Exit mobile version