ఐఎన్ఎస్ ఖుక్రీ… దేశంలో తయారైన మొదటి క్షిపణి సామర్థ్యమున్న యుద్ధనౌక. 1989 లో మజ్‌గావ్ డాక్‌లో తయారైంది. 1971 వ సంవత్సరంలో పాక్‌తో జరిగిన యుద్ధం సమయంలో అప్పటి ఖుక్రీ యుద్ధనౌకను అరేబియా సముద్రంలో పాక్ సైనికులు కూల్చివేశారు. ఆ తరువాత భారత్ కరాచీ రేవు పట్టణంపై బాంబుల వర్షం కురిపించి రేవును స్వాధీనం చేసుకోవడంతో పాక్ ఓటమిని అంగీకరించింది. అప్పటి ఖుక్రీ నౌక అందించిన సేవలకు గుర్తుగా దేశంలో తయారైన తొలి క్షిపణి యుద్ధనౌకకు ఐఎన్ఎస్ ఖుక్రీ అనే పేరును పెట్టారు. 32 ఏళ్లపాటు సేవలు అందించింది. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణం చేయగలదు.
Read: లైవ్: హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
1989 ఆగస్టు 23 వ తేదీన ఈ యుద్ధనౌక జలప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నౌకలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వహించారు. 32 ఏళ్లలో 6,44,897 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేసింది. అంటే ప్రపంచాన్ని 30సార్లు చుట్టి వచ్చినంత దూరం అన్నమాట. ఈ షిప్పులో పీ–20ఎం యాంటీషిప్ మిసైల్స్– 4, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్– 2, ఏకే–176 గన్ ఒకటి, ఏకే–630 గన్స్ రెండు ఉంటాయి. 32 ఏళ్లు నిర్వరామంగా విధులు నిర్వహించిన ఈ ఐఎన్ఎస్ ఖుక్రీ కి విశాఖలోని తూర్పు నౌకాదళంలో ఘనంగా వీడ్కోలు పలికారు.
