రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.ఈ రెండో టెస్టులో ఏకంగా 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు.. కేవలం 165 పరుగులకే ఆలౌట్ కావడంతో.. టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో…1-0 తేడాతో టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా.
కాగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో 276 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు… 167 పరుగులకు చాప చుట్టేసింది. దీంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.