న్యూజిలాండ్, టీం ఇండియా జట్ల మధ్య జరిగిన కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగిసింది. పదో వికెట్ తీయడంలో భారత బౌలర్లు…విఫలం కావడం కారణంగా.. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా మారిపోయింది. చివరి వరకు గెలుస్తుందనుకున్న… మ్యాచ్.. న్యూజిలాండ్ బ్యాటింగ్ కారణంగా దూరం అయింది. ఇండియా విజయాన్ని న్యూజిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అడ్డుకున్నారు.
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగా… ఆ చివరి పదో వికెట్ తీయడం లో టీమిండియా విఫలమైంది. ఇక అంతకు ముందు… భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 345 పరుగులకు ఆలౌట్ కాగా… సెకండ్ ఇన్నింగ్స్ లో 237 పరుగలకు డిక్లేర్డ్ చేసింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు… 296 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో టెస్ట్… డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.
