Site icon NTV Telugu

భారత్‌ కరోనా అప్‌డేట్‌.. ఇవాళ 9,216 కొత్త కేసులు

భారత్‌లో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… ఈ మధ్య రోజు వారి కేసుల సంఖ్య ఐదు వేల చేరువగా వెళ్లింది.. కానీ, మళ్లీ క్రమంగా పైకి కదులుతూ పోతోంది కోవిడ్‌ మీటర్… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,216 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెంచారు.. ఇదే పమయంలో 8612 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ..

Read Also: జవాద్ తుఫాన్ టెన్షన్.. విద్యుత్‌ పంపిణీ సంస్థకు ముప్పు..!

ప్రస్తుతం దేశ్యాప్తంగా 99,976 యాక్టివ్‌ కేసులు ఉండగా… ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది.. కోలుకున్నవారి సంఖ్య 3,40,45,666కి పెరిగింది.. ఇక, మరణాల సంఖ్య 4,70,115కి పెరిగినట్టు వెల్లడించింది.. మరోవైపు.. గత 24 గంటల్లో 73,67,230 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,25,75,05,514 వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది.

Exit mobile version