అనువాదాలతో అలరిస్తోన్న విజయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 22న విజయ్ బర్త్ డే)
ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. తెలుగేతరుల కళలను అభిమానించి, ఆరాధించడంలోనూ మనవారు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తెలుగు చిత్రసీమలో దర్శకునిగా సాగారు. చిరంజీవి హీరోగా చంద్రశేఖర్ దర్శకత్వంలో “చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు” వంటి సినిమాలు రూపొంది అలరించాయి. ప్రస్తుతం విజయ్ అనువాద చిత్రాలకు తెలుగునాట మంచి మార్కెట్ ఉంది.
అమ్మానాన్నల ఆరాటం…
విజయ్ బాల్యంలోనే ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఏది చెప్పినా ఇట్టే గ్రహించేసే వాడు. అతనిలోని ఆ చురుకుదనాన్ని చూసి, తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తాను తెరకెక్కించిన “వెట్రి, కుడుంబం, వసంతరాగం, సట్టం ఒరు విలయాట్టు, ఇదు ఎంగల్ నీతి, నాన్ సిగప్పు మనిదన్” వంటి చిత్రాలలో విజయ్ ని బాలనటునిగా నటింప చేశారు. ఆ సినిమాలతోనే విజయ్ మంచి పేరు సంపాదించాడు. ఇక విజయ్ తల్లి శోభ కూడా చిత్రసీమకు చెందినవారే. ఆమె గాయని, రచయిత్రి. చంద్రశేఖర్, శోభ దంపతులు తమ తనయుడు విజయ్ ని హీరోగా చూడాలని తపించారు. అందుకోసం శోభ కథను తయారు చేసి, నిర్మాతగా మారితే, తండ్రి చంద్రశేఖర్ మెగాఫోన్ పట్టి, ‘నాలై తీర్పు’ చిత్రం రూపొందించారు. ఈ సినిమా విజయ్ కి మంచి మార్కులే సంపాదించి పెట్టింది. ‘రసిగన్’ చిత్రంలో మరోమారు తండ్రి దర్శకత్వంలో నటించిన విజయ్ కు విమర్శకుల ప్రశంసలు లభించకున్నా, కావలసిన కమర్షియల్ సక్సెస్ దరి చేరింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అజిత్ తో ఢీ…
విక్రమన్ రూపొందించిన ‘పూవే ఉనక్కాగ’ సినిమాతో నటునిగానూ, హీరోగానూ మంచి మార్కులు సంపాదించిన విజయ్ ఆ తరువాత నుంచీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. మొదట్లో విజయ్ చిత్రాలన్నిటికీ ఆయన తండ్రి దర్శకుడు కావడంతో ‘తండ్రి చాటు బిడ్డ’ అనే మార్కు పడిపోయింది. ఆ తరువాత విజయ్ కి ఇతర దర్శకుల సినిమాలతో విజయాలు లభించినా, ఆ ముద్ర అంత తొందరగా చెరిగిపోలేదు. బాలశేఖరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ టుడే’ సినిమాతో మంచి విజయం విజయ్ సొంతమయింది. ఇదే చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’గా రూపొందింది. ఆ తరువాత నుంచీ విజయ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగారు. ఆరంభంలో విజయ్, అజిత్ కలసి నటించారు. తరువాత వారిద్దరి మధ్యనే బాక్సాఫీస్ వార్ మొదలయింది. ఎమ్జీఆర్ – శివాజీ గణేశన్, రజనీకాంత్ – కమల్ హాసన్ తరువాత బాక్సాఫీస్ వద్ద విజయ్ – అజిత్ జోడీకే మంచి పోటీ నెలకొందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే విజయ్ -అజిత్ ఫ్యాన్స్ మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ సాగుతూ ఉంటుంది.
ఇలయ దళపతి…
విజయ్ తమిళంలో నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో రీమేక్ అయి, ఇక్కడా విజయభేరీ మోగించాయి. అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఒకటి. తెలుగులో ఘనవిజయం చూసిన మహేశ్ ‘ఒక్కడు’ చిత్రం తమిళంలో విజయ్ తో ‘గిల్లీ’గా, ‘పోకిరి’ విజయ్ తో ‘పోక్కిరి’గా తెరకెక్కి అనూహ్య విజయం సాధించాయి. దాంతో విజయ్ స్టార్ స్టేటస్ మరింత గట్టి పడింది.
మెల్లగా మాస్ ను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేశాడు విజయ్. తన చిత్రాలలో ప్రజలను ఆకట్టుకొనే అంశాలను, ప్రస్తుత రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలనూ జోడించడం మొదలు పెట్టాడు. అలా విజయ్ సినిమాలకు మరింత క్రేజ్ నెలకొంది. ‘ఇలయ దళపతి’గా అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించిన విజయ్ తమిళ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలడని పలు సర్వేలు తెలిపాయి. ఆయన తండ్రి చంద్రశేఖర్ “విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని” ప్రకటించాడు కూడా. అయితే విజయ్ మాత్రం ప్రస్తుతానికి తాను నటనలోనే కొనసాగుతానని చెప్పాడు. పలు రాజకీయ పార్టీలు విజయ్ ను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాయి . కేంద్రప్రభుత్వం పైనా విజయ్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తన సినిమాల్లోనూ వదలడం లేదు. విజయ్ తెలుగు అనువాదాలు – “తుపాకి, పోలీసోడు, అదిరింది, సర్కార్” వంటివి ఎంతగానో అలరించాయి. రోజు రోజుకూ తెలుగునాట కూడా విజయ్ సినిమాలకు మార్కెట్ పెరుగుతోందనే చెప్పాలి. ఈ యేడాది ‘మాస్టర్’గా పలకరించిన విజయ్, వచ్చే సంవత్సరం ‘బీస్ట్’గా రాబోతున్నాడు. మరి ఆ సినిమాతో ఇలయ దళపతి ఏ తీరున ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!