చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులు వరుసగా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. తాజాగా మరో విద్యా్ర్థి సూసైడ్ చేసుకున్నారు. ఐఐటీలోని హాస్టల్ గదిలో ఈరోజు విద్యార్థిని శవమై కనిపించిందని, ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:Naresh: ‘మళ్లీ పెళ్లి’లో కృష్ణ, విజయ్ నిర్మల.. ఎవరో గుర్తుపట్టారా ..?
మహారాష్ట్రకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యను నిర్ధారిస్తే, ఈ ఏడాది ఐఐటీ-మద్రాస్‌లో ఇది నాలుగో కేసు అవుతుంది. ఈ నెల ప్రారంభంలో, ఐఐటి-మద్రాస్‌లో 32 ఏళ్ల పిహెచ్‌డి విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. అంతకు ముందు, మార్చిలో అదే క్యాంపస్‌లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మూడవ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిబ్రవరిలో, మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్ స్కాలర్ ఐఐటీ-మద్రాస్‌లో సూసైడ్ చేసుకున్నారు.
