కరోనా కొత్త వేరియంట్ భయం ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నది. వివిధ దేశాల నుంచి ప్రయాణికులు భారత్‌కు వస్తున్నారు. అయితే, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడానికి, రిపోర్టులు రావడానికి చాలా సమయం పడుతున్నది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రద్దీ పెరిగిపోవడంతో విమానాశ్రమాలు కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం ఉంది. దీంతో రద్దీని తగ్గించేందుకు వేగంగా కరోనా ఫలితాలు వచ్చేందుకు అవసరమైన కిట్‌ల తయారీపై ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దృష్టి సారించింది.
Read: పూర్తిగా దగ్ధమైన ఆర్మీ హెలికాప్టర్.. సీడీఎస్ బిపిన్ రావత్ పరిస్థితి ఏంటి..?
ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆర్టీ ల్యాంప్ పేరుతో కోవిడ్ కిట్‌ను సిద్దం చేసింది. ఈ కిట్‌తో పరీక్షలు నిర్వహిస్తే అరగంటలోనే ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ ఆర్టీల్యాంప్ కిట్‌తో వందశాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని, పైగా ఖర్చు సైతం 40 శాతం వరకు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరో రెండు వారాల్లో కొత్త కిట్‌లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
