Site icon NTV Telugu

స‌రికొత్త ఒమిక్రాన్ కిట్‌…రెండు గంట‌ల్లోనే ఫ‌లితాలు…

ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ జ‌రిగిన త‌రువాత ఒమిక్రాన్ వేరియంట్ నిర్థార‌ణ కోసం శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సి ఉంటుంది.  జీనోమ్ సీక్వెన్సింగ్ నుంచి నిర్ధార‌ణ పూర్త‌య్యి ఫ‌లితాలు వ‌చ్చే స‌రికి రెండు వారాల స‌మ‌యం పుడుతున్న‌ది.  నెగిటివ్ వ‌స్తే స‌రే, పాజిటివ్ వ‌స్తే ప‌రిస్థితి ఏంటి?  ఫ‌లితాలు రావ‌డానికి రోజుల త‌ర‌బ‌డి స‌మ‌యం తీసుకుంటే రాబోయే రోజుల్లో మ‌రిన్ని ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.  ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే ఒత్తిడి మ‌రింత పెర‌గొచ్చు.  దీనిని దృష్టిలో పెట్టుకొని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ స‌రికొత్త కిట్‌ను త‌యారు చేసింది.  

Read: రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… నేను హిందువుని, హిందువాదిని కాదు…

ఒమిక్రాన్ వేరియంట్‌ను వేగంగా గుర్తించే కిట్‌ను త‌యారు చేసింది.  ఈ కిట్ ద్వారా కేవ‌లం 2 గంట‌ల్లోనే వేరియంట్‌ను గుర్తించ‌వ‌చ్చు. హైడ్రాల‌సిస్ ప‌ద్ద‌తిలో రియ‌ల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ విధానంలోనే కొత్త వేరియంట్‌ను ఈ కిట్ గుర్తిస్తుంది.  ఐసీఎంఆర్-ఆర్ఎంఆర్సీ సంయుక్తంగా ఈ కిట్‌ను డెవ‌ల‌ప్ చేసింది.  అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించి త్వ‌ర‌లోనే ఈ కిట్‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ బోర్కాకోటీ తెలిపారు. 

Exit mobile version