Site icon NTV Telugu

దూకుడు పెంచిన శ‌శిక‌ళ‌… ఆమెకే ప‌గ్గాలు అప్ప‌గిస్తారా?

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఆసక్తిక‌రంగా మారుతున్నాయి.  అన్నాడీఎంకే 50 వ వార్షికోత్స‌వ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి.  ఈ వేడుక‌ల్లో చిన్న‌మ్మ శ‌శిక‌ళ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది.  పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు అటు మాజీ ముఖ్య‌మంత్రులు ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నీ స్వామి పోటీ ప‌డుతున్నారు.  ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి పార్టీని న‌డిపించాల‌ని చూస్తున్నారు.  అయితే, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చిన శ‌శిక‌ళ ఇప్పుడు మ‌ర‌లా రాజ‌కీయాల్లో రాణించేందుకు అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు.  ఆమె ఆధ్వ‌ర్యంలో నిన్న‌టి రోజున అన్నాడీఎంకే 50 వ వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కంలో అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శ‌శిక‌ళ పేరును వేసుకున్నారు.  త‌న‌ను తాను అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌క‌టించుకోవ‌డంతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.  క‌లిసి పనిచేస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని, ఎంజీఆర్‌, అమ్మ జ‌య‌ల‌లిత క‌ల‌లు సాకారం చేస్తామ‌ని, విడిపోతే అది ప్ర‌త్యర్థుల‌కు బ‌లంగా మారుతుంద‌ని శ‌శిక‌ళ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.  మ‌రి ఆమెకు పార్టీలో స్థానం క‌ల్పిస్తారా లేదంటే ఎప్ప‌టిలాగే పార్టీలో స్థానం లేద‌ని మ‌రోసారి గట్టిగా చెబుతారా చూడాలి.  

Read: తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌కుంటే… వారికే లాభ‌మా…!!

Exit mobile version