NTV Telugu Site icon

హుజురాబాద్‌: నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు నేడు చివ‌రి రోజు… పెరుగుతున్న ఉత్కంఠ‌త‌

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగియ‌నున్న‌ది.  ఈరోజు సాయంత్రం గుర్తుల‌ను కేటాయించ‌నున్నారు.  ప్ర‌స్తుతానికి బ‌రిలో 42 మంది అభ్య‌ర్థులు ఉన్నారు.  ఇందులో ఎంత‌మంది నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకుంటారు అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది.  ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ఉప‌సంహ‌ర‌ణ‌కు స‌మ‌యం ఉన్న‌ది.   పోటీనుంచి త‌ప్పుకునే వారు నేరుగా సంత‌కం పెట్టి నామినేష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాలి.  అధికార టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, 32 మంది స్వ‌తంత్రులు, 7 మంది ఇత‌ర పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.  పోటీలో ఉన్న అభ్య‌ర్థుల సంఖ్య‌ను బ‌ట్టి ఈవీఎంల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.  ఒక్కో బ్యాలెట్‌లో నోటాతో క‌లిపి 16 మంది అభ్య‌ర్థులను మాత్ర‌మే పొందుప‌ర్చాల్సి ఉంటుంది.  42 మందిలో సగం మంది విత్‌డ్రా చేసుకున్నా, రెండో బ్యాలెట్ ఏర్పాటుకు అవ‌కాశం ఉంటుంది.  బ్యాలెట్‌లో అభ్య‌ర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులు త‌ప్ప‌నిస‌రి.  స్వ‌తంత్ర అభ్య‌ర్థుల పేర్ల‌తో అక‌క్ష‌రాల క్ర‌మంలో సింబ‌ల్స్ కేటాయింపుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు.  

Read: యూనిసెఫ్ ఆందోళ‌న‌: ఇప్పుడు ఆదుకోకుంటే… భ‌విష్య‌త్ త‌రాల‌కు పెనుదెబ్బ‌…