యూనిసెఫ్ ఆందోళ‌న‌: ఇప్పుడు ఆదుకోకుంటే… భ‌విష్య‌త్ త‌రాల‌కు పెనుదెబ్బ‌…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ త‌రువాత ఆ దేశంలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  తాలిబ‌న్ల‌ను చూసుకొని ఇత‌ర ఉగ్ర‌వాద సంస్థ‌లు రెచ్చిపోతున్నాయి.  ర‌ష్యా, పాక్‌, చైనా మిన‌హా మిగ‌తా దేశాలు త‌మ రాయ‌బార కార్యాల‌యాల‌ను మూసేసిన సంగ‌తి తెలిసిందే.  తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌క‌పోవ‌డంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి.  దీంతో పేద‌ల‌కు స‌రైన ఆహారం దొర‌క‌డం లేదు.  ఈ స‌మ‌స్య నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ బ‌య‌ట‌ప‌డాలి అంటే సుమారు 1.6 బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయం అవ‌స‌రం అవుతంది.  ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు వివిధ దేశాలు ముందుకు వ‌స్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటే,  ప్ర‌స్తుతం పిల్ల‌ల‌కు ఆహ‌రం దొరక్క ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, సుమారు 10 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు పోష‌కాహార లోపంతో ఇబ్బందులు ప‌డుతున్నారని, ఇదిలాగే కొన‌సాగితే ఆఫ్ఘ‌నిస్తాన్ భ‌విష్య‌త్ త‌రాల‌ను కోల్పేయే ప్ర‌మాదం ఉంద‌ని యూనిసెఫ్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.  

Read: ఆంక్ష‌లు ఎత్తివేత‌: అక్టోబ‌ర్ 18 నుంచి పూర్తిస్థాయిలో విమానాలు…

-Advertisement-యూనిసెఫ్ ఆందోళ‌న‌: ఇప్పుడు ఆదుకోకుంటే... భ‌విష్య‌త్ త‌రాల‌కు పెనుదెబ్బ‌...

Related Articles

Latest Articles