NTV Telugu Site icon

హుజురాబాద్: ఉప ఎన్నికపై భారీ నిఘా…

ఈనెల 30 వ తేదీన జ‌గ‌ర‌బోతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు.  గ‌త ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేస్తున్న బందోబ‌స్తు మ‌రింత ఎక్కువ‌గా ఉన్న‌ది.  1900 మంది బ‌ల‌గాల‌తో క‌ట్టుదిట్ట‌మైన బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. బ్లూకోట్స్, పెట్రో కారుల‌తో పెట్రోలింగ్‌ను నిర్వ‌హిస్తున్నారు.  డ్రోన్ కెమెరాల‌తో నిరంత‌రం నిఘాను ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  స‌మ‌స్యాత్మ‌క‌మైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.  హుజురాబాద్ ప‌రిధిలోని నాలుగు మండ‌లాల్లో 406 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.  హుజురాబాద్‌లో 110, జిమ్మికుంట‌లో 169, వీణ‌వంక‌లో 87,ఇల్లందకుంట‌లో 36 కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ల‌క్ష‌ల విలువైన మ‌ద్యం, గంజాయి, జిలెటిన్ స్టిక్స్, డిటోనేట‌ర్లు, 75 ఆయుధాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై 33 కేసులు పెట్టారు.  ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా 24 గంట‌లు రెండు సైబ‌ర్ క్రైమ్ టీమ్స్ నిఘా పెట్టాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Read: టీకా తీసుకుంటే ఆ వేరియంట్ల నుంచి ర‌క్ష‌ణ‌…