NTV Telugu Site icon

మేక‌ప్ లేకుండా భార్య‌ను చూసి షాకైన భ‌ర్త‌… వెంట‌నే…

ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీల‌తో పాటుగా సామాన్య మ‌హిళ‌లు కూడా మేకప్ లేకుండా బ‌య‌ట‌కు రావ‌డంలేదు.  కొంత‌మంది ఇంట్లో ఉన్న‌ప్పుడు కూడా మేక‌ప్ వేసుకుంటున్నారు.  ఇంట్లో ఉన్న వ్య‌క్తులే మేక‌ప్ లేకుండా ఉన్నారా మేక‌ప్‌తో ఉన్నారా అని గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, నెల రోజుల క్రితం కైరోకు చెందిన ఓ వ్య‌క్తికి వివాహం జ‌రిగింది.  భార్య అందంగా ఉంద‌ని ఆ భ‌ర్త మురిసిపోయాడు.  భార్య అందం గురించి చుట్టుప‌క్క‌ల వారితో చెప్పుకొని సంతోషించేవాడు.  

Read: డ్రైవ‌ర్ల‌కు తాలిబ‌న్ కీల‌క ఆదేశాలు… అయోమ‌యంలో ట్యాక్సీవాలాలు…

అయితే, ఓరోజు స‌డెన్ గా భార్య‌ను మేక‌ప్ లేకుండా చూసి ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు.  బాత్‌రూమ్‌లో నుంచి ముఖం క‌డుక్కొని వ‌చ్చిన భార్య‌ను చూసి అవాక్కైన ఆ భ‌ర్త తేరుకొని కోర్టును ఆశ్ర‌యించాడు.  పెళ్లైన నెల రోజుల్లో తొలిసారిగా భార్య‌ను మేక‌ప్ లేకుండా చూశాన‌ని, అందంగా మేక‌ప్ వేసుకొని త‌న‌ను మోసం చేసింద‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించాడు స‌ద‌రు వ్య‌క్తి.  దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.