Site icon NTV Telugu

India Constitution Day History: మీకు తెలుసా! భారత తొలి గణతంత్ర పరేడ్‌కు ముఖ్య అతిథిగా పాకిస్థాన్ గవర్నర్ జనరల్‌..

India First Republic Day Parade

India First Republic Day Parade

India Constitution Day History: నేడు భారత రాజ్యాంగ దినోత్సవం.. దాదాపు 200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని.. స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో మన రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. 1947లో స్వాతంత్రం లభించిన రెండేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26 నాటి రాజ్యాంగ పరిషత్‌లో ఆమోదించి, స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఇక, రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలనే ఆలోచన 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎల్‌.ఎమ్‌. సింఘ్వీకి వచ్చింది. దీంతో నవంబరు 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాల ని తీర్మానించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ లేఖ రాశారు.. వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతుంది.. దేశ పౌరులు తమ విధుల నిర్వహణకు ప్రతిజ్ఞ చేయాలి.. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దోహద పడాలి.. ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు.

READ MORE: YS Jagan: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది..

అయితే.. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా అవతరించింది భారత్‌. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో దాదాపు 283 రాజ్యాంగసభ సభ్యులు సంతకం చేశారు. ఆ సమయంలోనే వర్షం పడటంతో చాలామంది దాన్ని దేశానికి శుభసూచకంగా భావించారు. 1950 జనవరి 26న గణతంత్ర భారత్‌కు తొలి రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ నియమితులయ్యారు. అదే సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్‌ బీఆర్​ అంబేద్కర్‌ వ్యవహరించారు. నాడు తొలి గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌ తొలి గవర్నర్ జనరల్‌ మాలిక్‌ గులాం మొహమ్మద్‌ ముఖ్య అతిథిగా హాజరుకావడం..

READ MORE: Akhanda 2 : అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లొకేషన్, టైమింగ్ అవుట్ – ఫ్యాన్స్ రెడీ అవ్వండి!

సంప్రదాయం ప్రకారం.. భారత గణతంత్ర దినోత్సవ కవాతులో ముఖ్య అతిథికి దేశ అత్యున్నత గౌరవం ఇస్తారు. భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవానికి ఆరు నెలల ముందు ఆహ్వానాన్ని దేశాధినేతకు లేదా ప్రభుత్వానికి పంపుతుంది. ఇది భారతదేశం ఆ దేశంతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. భారత్‌ నుంచి విడిపోయిన పాకిస్థాన్‌తో అప్పట్లో సానిహిత్య సంబంధాన్ని కలిగి ఉన్న విషయం తెలిసిందే. దీంతో భారత తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ, నాటి భారత రాష్ట్రపతి అనుమతితో ఇండోనేసియా, పాకిస్థాన్‌కు ఆహ్వానం అందించారు. తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1955లో జనవరి 26న తొలిసారి గణతంత్ర పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌ తొలి గవర్నర్ జనరల్‌ మాలిక్‌ గులాం మొహమ్మద్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Exit mobile version