విజయదశమి రోజు దేశ వ్యాప్తంగా పండుగ నిర్వహిస్తే, కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం ఈరోజు జరగనున్నది. ఈ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వస్తారు. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆ మూర్తుల కోసం కర్రలతో తలపడతారు. వందల సంఖ్యలో ప్రజలు ఈ కర్రల యుద్దంలో పాల్గొంటారు. అయితే, ఈ కర్రల యుద్ధంలో రక్తం ఏరులై పారుతుంటుంది. ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందొబస్తు ఏర్పాట్లు చేశారు. ఏడుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 164 మంది ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 322 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా పోలీసులు, మూడు ప్లాటూన్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది, 200 మంది హోమ్ గార్డులను ఈ బందోబస్తుకు కేటాయించారు.
Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: పవర్ హౌస్‌లను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఉత్తర్వులు