Site icon NTV Telugu

“హీరో” రికార్డులు మొదలయ్యాయి…!?

Hero TitleTeaser makes its mark with 1 Million+ Views

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా “హీరో”గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అశోక్ ను ఇప్పుడు ఆయన తండ్రి జయదేవ్ గల్లా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘హీరో’ మూవీ అతి త్వరలోనే విడుదల కానుంది. ఈరోజు ఉదయం ఈ మూవీ టైటిల్ ను, టీజర్ ను ప్రిన్స్ మహేశ్ బాబు విడుదల చేశారు. ఇక ఈ “హీరో” టీజర్ విడుదలైన గంటల్లోనే రికార్డులు మోత మోగించడానికి సిద్ధమయ్యాడు. “హీరో” టీజర్ విడుదలైన గంటల్లోనే 1 మిలియన్ భారీ వ్యూస్ తో దూసుకెళ్తోంది. కనీసం ఈ టీజర్ విడుదలై ఇంకా ఒకరోజు కూడా గడవక ముందే ప్రేక్షకుల నుంచి ఇలాంటి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం విశేషం. టీజర్ తోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఈ ‘హీరో’ రానున్న రోజుల్లో ఇంకెంత సందడి చేయనున్నాడో చూడాలి.

Exit mobile version