Site icon NTV Telugu

పెట్రోల్ బంకుల్లో ఈ సేవ‌లు పూర్తిగా ఉచితం… అవేంటో తెలుసా…

గ‌త కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.  లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద‌కు పైగా ప‌లుకుతున్న‌ది. వినియోగ‌దారులు ప్ర‌తి మీట‌ర్‌పై వ్యాట్ రూపంలో చెల్లించే డ‌బ్బుతో బంకుల్లో వినియోగాదుల‌కు అనేక సౌక‌ర్యాలు క‌ల్పించాల్సి ఉంటుంది.  అవేంటో ఇప్పుడు చూద్దాం.  పెట్రోల్ బంకుల్లో తప్ప‌నిస‌రిగా వినియోగ‌దారుల కోసం త‌ప్ప‌నిస‌రిగా స్వ‌చ్ఛ‌మైన త్రాగునీరు అందించాలి.  అదేవిధంగా వాహ‌న‌దారులు, ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం త‌ప్ప‌ని స‌రిగా మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.  ప్ర‌జ‌లు వినియోగించుకోకున్నా త‌ప్ప‌నిస‌రిగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  

Read: “పుష్ప” ఈవెంట్ ఆపేస్తాం… బన్నీ ఫ్యాన్స్ కు వార్నింగ్

కొన్ని చోట్ల మాత్రం అస‌లు మ‌రుగుదొడ్లు అన్న‌వి క‌నిపించ‌వు. మ‌నం చెల్లించే రుసుములో 4 నుంచి 8 పైస‌లు మ‌రుగుదొడ్లు, మూత్ర‌శాల‌ల నిర్వాహ‌ణ‌కు చెల్లిస్తుండాలి. అంతేకాదు, ఆప‌ద‌వేళ‌ల్లో వినియోగించుకునేందుకు త‌ప్ప‌ని స‌రిగా ఫోన్ సౌక‌ర్యం పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచాలి.  అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో టైర్ల‌లో ఉచితంగా గాలి నింపాలి. పెట్రోల్ బంకుల్లో గాలినింపే యంత్రాలు ఉన్న‌ప్ప‌టికీ చాలా చోట్ల ఉచితంగా పెట్ట‌డం లేదన్న‌ది వాస్త‌వం.  త‌ప్ప‌ని స‌రిగా డబ్బులు వ‌సూలు చేస్తున్నారు. అంతేకాదు, బంకుల్లో త‌ప్ప‌నిస‌రిగా ఫిర్యాదుల పెట్టె, ప్ర‌థ‌మ చికిత్స కిట్టు త‌ప్ప‌నిస‌రిగా అందుబాటులో ఉంచాలి.  అలానే పెట్రోల్‌, డీజిల్ నాణ్య‌త ప్ర‌మాణాలు తెలుసుకునే హ‌క్కు ప్ర‌తి వినియోగ‌దారునికి ఉంటుంది.  

Exit mobile version