NTV Telugu Site icon

వైర‌ల్‌: పాముకాటుకు నాటుకోడి వైద్యం…

పాము క‌రిస్తే వెంట‌నే వైద్యుని వ‌ద్ద‌కు తీసుకెళ్లి యాంటీ పాయిజ‌న్ ఐవీ ఇంజెక్ష‌న్ చేయించాలి.  అలా ఇంజెక్ష‌న్‌ను చేయించ‌డం వ‌ల‌న ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డొచ్చు.  పాము క‌రిచిన వెంట‌నే దాని పైభాగంతో గుడ్డ‌తో గ‌డ్డిగా క‌ట్టి ఆసుప‌త్రికి తీసుకెళ్లాలి.  లేదంటే విషం పైకి పాకే ప్ర‌మాదం ఉంటుంది.  విషాన్ని వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌కు తీసేయ్యాలి.  లేదంటే ప్రాణాల‌కు ప్రమాదం. అయితే, ఖ‌మ్మం జిల్లాలోని బోల‌క‌ల్ మండ‌లంలోని క‌ల‌కోట గ్రామంలో పాము క‌రిచిన వారికి నాటుకోడి వైద్యం చేస్తున్నారు.  ఇలా నాటుకోడి వైద్యం చేయించుకున్న వారిలో ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించ‌లేద‌ని వైద్యం చేస్తున్న సురేష్ అనే వ్య‌క్తి చెబుతున్నాడు.

Read: 3540 కిమీ 120 బ‌స్సుల్లో ఫ్రీగా ప్ర‌యాణం చేసిన బామ్మ‌… ఎలాగంటే…

ప‌దేళ్ల నుంచి ఇలా నాటుకోడి వైద్యం చేస్తున్నాన‌ని, 300 మందికి వైద్యం చేసిన‌ట్టు తెలిపారు.  ఒక్క‌రు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెంద‌లేద‌ని అంటున్నాడు సురేష్‌.  పాముక‌రిచిన వ్య‌క్తి గాయంపైన నాటుకోడి మ‌ల‌ద్వారం ఉంచి కోడిని గ‌ట్టిగా ప‌ట్టుకుంటార‌ట‌.  అలా విషం ఆ మ‌నిషి నుంచి కోడి మ‌ల‌ద్వారం ద్వారా లోప‌లికి వెళ్తుంది.  కోడి మ‌ర‌ణించే వ‌ర‌కు అలానే ప‌ట్టుకుంటారు.  మ‌నిషి క‌రిచిన పామును బ‌ట్టి విషాన్ని బ‌య‌ట‌కు తీసేందుకు 5 నుంచి 15 కోళ్లు అవ‌స‌రం అవుతాయ‌ని చెబుతున్నారు.  పాము క‌రిచిన గంట‌న్న‌ర లోగా మ‌నిషిని తీసుకురావాల‌ని సురేష్ చెబుతున్నాడు.  క‌ల‌కోట గ్రామంలోనే కాకుండా చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి కూడా పాముక‌రిచిన వారిని సురేష్ వ‌ద్ద‌కు తీసుకొచ్చి నాటుకోడి వైద్యం చేయిస్తున్నార‌ట‌.