కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తిరువనంతపురం, కొట్టాయం, పథనం మిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, త్రివిధ దళాల సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు.
కేరళలో భారీ వర్షాలు… విరిగిపడ్డ కొండచరియలు…
