ఆఫ్రికా దేశం కెన్యాలో ప్రస్తుతం కరువు తాండవిస్తోంది. సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో వన్యప్రాణులకు ఆహరం, నీరు దొరక్క మృత్యువాత పడుతున్నాయి. కెన్యా సఫారీలోని ఓ ప్రాంతంలో ఆరు జిరాఫీలు ఆహారం, నీరు దొరక్క మృత్యువాత పట్టాయి. ఆ దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. డ్రోన్ నుంచి తీసిన ఫొటోలు చూస్తే చేత్తో వేసిన ఆర్ట్స్ మాదిరిగా ఉన్నది. అయితే, అదే ఫొటోలను దగ్గరగా చూస్తే ఒళ్లు జలదరించకమానదు.
Read: వేతనాలు,పెన్షన్లపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు…
ఒకేచోట ఆరు జీవాలు నీరు, ఆహారం దొరక్క మృతిచెందడంతో ప్రపంచం మొత్తం షాకయింది. వన్యప్రాణులను రక్షించేందుకు కెన్యాకు అవసరమైన సహాయం చేయాలని ప్రపంచదేశాలను నెటిజన్లు కోరుతున్నారు. జిరాఫీల మృతికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ కరువు ఇలానే కొనసాగితే జిరాఫీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే,వన్యప్రాణుల కోసం కృత్రిమ సరస్సులు ఏర్పాటు చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
