Site icon NTV Telugu

ఒమిక్రాన్ టెన్ష‌న్‌: హ‌ర్యానా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం…

దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  క‌రోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండ‌టంతో హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. సినిమా హాల్స్‌, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, పార్కులు మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.  గురుగ్రామ్‌, ఫ‌రీదాబాద్ తో పాటు మూడు జిల్లాల్లో రూల్స్ పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  ఇప్ప‌టికే హ‌ర్యానాలో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  హ‌ర్యానాలో సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటుగా ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రులు క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  

Read: గుడ్‌న్యూస్‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు…

హ‌ర్యానా స‌రిహ‌ద్దు రాష్ట్రం ఢిల్లీలో భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఆ రాష్ట్రంలో పాజిటివిటి రేటు 3.64 శాతంగా ఉండ‌టంతో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.  ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  స్కూళ్లు, సినిమా థియేట‌ర్ల‌ను మూసేసిన సంగ‌తి తెలిసిందే.  ఇక కేంద్ర ఆరోగ్య‌శాఖ సైతం క‌రోనా విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, కోవిడ్ ఆసుప‌త్రుల‌ను రెడీ చేసుకోవాల‌ని శ‌నివారం రోజున సీఎస్‌ల‌కు లేఖ‌లు రాసింది. 

Exit mobile version