ఈరోజు ఉదయం నుండి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పాండ్యా వద్ద 5 కోట్ల విలువగల విదేశీ వాచులు ముంబై ఎయిర్ పోస్ట్ లో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసారని వార్తలు వస్తున్నాయి. అదే దీని పైన పాండ్యా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దుబాయ్ నుండి తెచ్చిన వస్తువులను… నేనే స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకెళ్లానని… దానికి అవసరమైన మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు కస్టమ్స్ కౌంటర్ కు వెళ్లి చెప్పినట్లు పాండ్యా తెలిపాడు.
అయితే నేను తెచ్చిన వాచ్ ల విలువ 5 కాదు.. కేవలం 1.5 కోట్ల మాత్రమే అని స్పష్టం చేసాడు పాండ్యా. వాటిని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సరైన వాల్యుయేషన్ కోసం మాత్రమే తీసుకుందని హార్దిక్ తెలిపారు. అలాగే వీటికి కావాల్సిన చట్టబద్ధమైన పత్రాలను వారికి అందజేస్తాను అని చెప్పిన పాండ్యా… నాపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను… నేను స్పష్టం చేయాలనుకున్నాను అని అని హార్దిక్ అన్నారు.