NTV Telugu Site icon

నీ బాంచెన్ కాల్మొక్తా… గ్రామాన్ని అభివృద్ధి చేయండి..!

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ వుంటుంది. అయితే నిధులు సకాలంలో అందకపోతే పరిస్థితి ఎలా వుంటుంది. ఓ గ్రామ సభలో సర్పంచ్,పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడి వేడుకుంటున్న సీన్ వరంగల్ జిల్లాలో కనిపించింది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వేడుకోవాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో గ్రామ సభ గందరగోళంగా మారింది. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ని నిలదీశారు. గ్రామ సభకు గ్రామ స్థాయి అధికారులు హాజరు కాక పోవటంతో గ్రామ సభలో గందరగోళం నెలకొంది.

బాంచెన్ సారు కనికరించండి.. అంటూ గ్రామ సభలో సర్పంచ్ పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వేడుకోవాల్సి వచ్చింది. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దాలనే సంకల్పం నీరుగారిపోతోంది. పంచాయితీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సర్పంచ్ కాళ్లపై పడాల్సిన దుస్థితి దాపురించింది.ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి చిన్న గూడూరు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, పాలకవర్గంపై చర్యలు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.ఈ దయనీయ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.