Site icon NTV Telugu

విద్యుత్ నియంత్రణ భవన్ కు గవర్నర్ తమిళిసై శంకుస్థాపన

విద్యుత్ నియంత్రణ భవన్ కు శంకుస్థాపన చేశారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఈ కార్య‌క్ర‌మంలో… ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు, సీఎండీ ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ… ఈఆర్సీ కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని… ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్ల‌డించారు. అత్యాధునిక సాంకేతికతో ఈఆర్సీ భవన నిర్మాణం చేపడుతున్నారని… సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ ఎపిసెన్సీ, పర్యావరణ రహిత భవనం వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 2022 వరకు ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతుందన్నారు.

Exit mobile version