NTV Telugu Site icon

భార‌తీయులు ఎక్కువ‌గా ఎవ‌రి గురించి సెర్చ్ చేశారో తెలుసా…!!

గూగుల్ సంస్థ ప్ర‌తి ఏడాది ఇయ‌ర్ ఆఫ్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌ను ప్ర‌క‌టిస్తుంది. ఇండియాలో టాప్ లిస్ట్ లో సినిమా సెల‌బ్రిటీలు లేదా పొలిటీషియ‌న్లు ఉంటారు.  అయితే, ఈ ఏడాది అనూహ్యంగా సెలబ్రిటీలను, పొలిటీషియ‌న్ల‌ను కాకుండా జావెలింగ్ త్రోలో ఒలింపిక్స్ స్వ‌ర్ణ‌ప‌త‌క విజేత నీర‌జ్ చోప్రా గురించి ఎక్కువ‌మంది సెర్చ్ చేశారు. నీర‌జ్ చోప్రా త‌రువాత స్థానంలో ఆర్య‌న్ ఖాన్‌, షెహ‌నాజ్ గిల్‌, రాజ్ కుంద్రా ఉండ‌గా, ఐదో స్థానంలో ఎల‌న్ మ‌స్క్  నిల‌వ‌డం విశేషం. భార‌తీయులు ఎల‌న్ మ‌స్క్ గురించి సెర్చ్ చేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.  

Read: భార్య‌ను టీజ్ చేశార‌ని… ఆయ‌న ఓ ప్ర‌పంచాన్నే సృష్టించాడు…

స్పేస్ ఎక్క ను నెల‌కొల్పిన త‌రువాత స్పేస్‌లోకి వ్యోమ‌గాముల‌ను విజ‌య‌వంతంగా పంపించారు.  ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో ఎల‌న్ మ‌స్క్ పేరు ద‌శ‌దిశ‌లా మారుమ్రోగిపోయింది.  ఎప్ప‌టికైనా అంగార‌క‌గ్ర‌హం మీద‌కు మ‌నిషిని పంపాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.  మ‌స్క్ త‌రువాత విక్కి కౌశ‌ల్‌, పీవీ సింధూ, భ‌జ‌రంగ్ పూనియా,  శుశీల్ కుమార్ త‌దిత‌రుల‌ను ఎక్కువ‌గా సెర్చ్ చేశారు.