పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, ఒక్కసారిగా వరుసగా రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అయితే శుక్రవారం స్వల్పంగా తగ్గింది. ఇవాళ 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారంపై రూ 100, స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడిపై రూ. 110 చొప్పున తగ్గింది.
Also Read:Bhatti Vikramarka : దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పరిపాలన
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,100గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.61,200 గా నమోదైంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 56,100కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ. 61,200గా నమోదైంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,350 గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,700 వద్ద కనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,200కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,150గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 వద్ద కొనసాగుతోంది.
Also Read:MVV Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు
