NTV Telugu Site icon

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

Gold

Gold

బంగారం కొనాలనుకునే వారికి భారీ శుభవార్త.. నేటి మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. మొన్నటి వరకు పైకి ఎగసిన బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి..అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలిన కూడా హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రేట్లు ఒక్కసారిగా కిందకు దిగాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ఈ ధరలు ఇప్పుడు నెలకు దిగిరావడం పై పసిడి ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిన్న, ఈరోజు రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి..

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి, రూ. 59, 510 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 54, 550 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 76, 200 గా నమోదు అయ్యాయి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

#. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,840 కి చేరింది..
#. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,510 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
#. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,660 గా నమోదైంది.
#.జైపుర్, లఖ్నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్కతా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,510 గా ఉంది.
#. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,510 గా ఉంది. బంగారం తగ్గితే, వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.. ఇక రేపు మార్కెట్ ఎలా నమోదు అవుతాయో చూడాలి..