యూరప్ ఖండం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూరప్ ఖండంలో వేగంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా విద్యాసంవత్సరం చాలా వరకు దెబ్బతిన్నది. ఆగస్టు నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 7 వ తేదీ నుంచి 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫైజర్ లేదా బయో ఎన్‌టెక్ కరోనా టీకాలు ఇవ్వడానికి యూరోపియన్ మెడిసిన్స్ ఎజన్సీ ఆమోదం తెలిపింది. దీంతో జూన్ 7 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. జులై చివరి నాటికి 12 నుంచి 15 ఏళ్లు వయసు వారికి మొదటిడోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జర్మనీ ప్రభుత్వం పేర్కొన్నది.
జర్మనీ కీలక నిర్ణయం…జూన్ 7 నుంచి పిల్లలకు టీకా…
