Site icon NTV Telugu

నేటి నుంచి గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ టెస్టులు

క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు వెలుగు చూసిన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గాంధీ ఆస్ప‌త్రిలో విశిష్ట సేవ‌లు అందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికి కూడా చాలా మంది క‌రోనా బాధితులు గాంధీ లోనే చికిత్స పొందుతున్నారు. ఈ త‌రుణంలో… మ‌రో అధునాత‌న సేవ‌ల‌ను గాంధీ ఆస్ప‌త్రి అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది.

https://ntvtelugu.com/peddi-reddy-comments-on-ap-development/

నేటి నుంచి గాంధీ లో జీనోమ్ సీక్వెన్సింగ్‌ టెస్టుల‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా.. గాంధీ సూపరిండెంట్ రాజారావు మీడియాకు చెప్పారు. కరోనా వేరియంట్ల స్టడీ కోసం ఇప్పటి వరకు.. పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపింది తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ‌. ఇక నేటి నుంచి గాంధీ లో జీనోమ్ సీక్వెన్సింగ్‌ టెస్టులు అందుబాటులోకి రావ‌డంతో.. ఇక ఆరోగ్య శాఖ ఆ స‌మ‌స్య‌లు త‌ప్ప‌నున్నాయి.

Exit mobile version