గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్కులు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రయివేట్ ట్రావెల్స్ బస్ లో గంజాయిని పట్టుకున్నారు శ్రీకాకుళం పోలీసులు. శ్రీకాకుళం జాతీయ రహదారిపై మూడు గంటల పాటు చీకట్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ చెందిన ప్రైవేటు ట్రావెల్స్ లో సుమారు 30 కిలోల గంజాయితో ఎస్.ఈ.బి పోలీసులు పట్టుకున్నారు.
బస్సు 35 మంది ప్రయాణికులుతో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతోంది. అటు ముద్దాయిని,ఇటు బస్ డ్రైవర్ ను కాశీబుగ్గ పోలీసులు తీసుకుపోగా నడి రోడ్డుపై 35 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆకలితో చిన్న పిల్లలు మహిళలు అలమటిస్తుండగా విషయం తెలుసుకున్న టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు బి నాగరాజు, ఎమ్. శ్రీనివాస్ వారి బృంద సభ్యులు హుటాహుటిన ప్రయాణికులకు త్రాగునీరు, భోజన ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు మరో డ్రైవర్ తో బస్సు ముందుకు కదిలింది.