Site icon NTV Telugu

మాదకద్రవ్యాలకు అడ్డా@నందిగామ విజయటాకీస్

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, హెరాయిన్, బంగారం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. కృష్ణా జిల్లాలో మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది నందిగామలోని విజయ టాకీస్ సెంటర్. డ్రగ్స్ మత్తులో యువత జోగుతోంది. ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారు. అక్కడ యువత గంజాయికి బానిసగా మారుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

డ్రగ్స్ దొరక్కపోతే యువత ఆత్మహత్యలకు పాల్పడతామని వార్నింగ్‌ లు ఇస్తున్నారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నారు. తమ పిల్లలు డ్రగ్స్ కి బానిసలవుతున్నారని, బ్లేడ్‌తో కోసుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదుచేపినా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నారు తల్లిదండ్రులు. పిల్లలకు గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version