Site icon NTV Telugu

జైల్లో గ్యాంగ్ వార్‌: 68 మంది మృతి…

ఈక్వెడార్ లోని ఓ జైలులో రెండు ముఠాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.  ఆ ఘ‌ర్ష‌ణ‌లో 68 మంది మృతి చెందారు.  25 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ‌వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.  మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  ఈక్వెడార్‌లోని తీర‌ప్రాంత‌మైన గుయాక్విల్‌లోని జైలులో ఆ దారుణం చోటుచేసుకున్న‌ది.  గుయాక్విల్ జైలులో తీవ్ర‌మైన నేరాల‌కు పాల్ప‌డిన వారిని, డ్రగ్స్‌కేసులో బుక్ అయిన వారిని ఉంచుతారు.  

Read: ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం

అయితే, డ్ర‌గ్స్ ముఠాతో సంబంధాలున్న రెండు ముఠాల మ‌ధ్య మొద‌లైన ర‌డ‌గ ఘ‌ర్ష‌ణ‌గా మారింది.  క‌త్తులతో దాడులు చేసుకున్నారు.  గ‌న్ ఫైరింగ్‌ల‌కు పాల్ప‌డ్డారు.  దాదాపు 8 గంట‌ల పాటు గుయాక్విల్ లో ఆ ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి.  ముఠాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు అద‌న‌పు పోలీసుల‌ను రంగంలోకి దించ‌డంతో గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయి.  జైల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Exit mobile version