Site icon NTV Telugu

ఒక‌సారి ఛార్జింగ్‌ చేస్తే చాలు… 750 కిమీ ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు…

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరుగుతున్న‌ది. చ‌మురుతో న‌డిచే వాహానాల వ‌ల‌న క‌ర్భ‌న ఉద్గారాలు వెలువ‌డుతున్నాయి.  ప‌ర్యావ‌ర‌ణానికి ఇది హానిక‌లిగించే అంశం కావ‌డంతో ప్ర‌త్యామ్మాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరిగింది.  ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టి వ‌ర‌కు మోబైల్ ఫోన్ త‌యారీ సంస్థ‌ల‌గా ఉన్న ఫాక్స్‌కాన్ సంస్థ ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీరంగంలోకి అడుగుపెట్టింది.  విద్యుత్‌తో న‌డిచే కార్ల‌ను త‌యారు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఇందులో భాగంగా వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటోంది.  ఇట‌లీకి చెందిన ఫినిస్‌పార్నియాతో ఇప్ప‌టికే ఓప్పందం కుదుర్చుకున్న‌ది ఫాక్స్‌కాన్ సంస్థ.  ఫినిస్‌పార్నియా సంస్థ నుంచి 2023లో సెడాన్ ఇ మోడ‌ల్ కారును 2023లో రిలీజ్ చేయ‌బోతున్నారు.  విద్యుత్‌తో న‌డిచే ఈ కారు బ్యాట‌రీని ఒక‌సారి రీఛార్జ్ చేస్తే 750 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.  అదేవిధంగా ఫాక్స్‌కాన్ సంస్థ సొంతంగా విద్యుత్‌తో న‌డిచే బ‌స్సును విప‌ణిలోకి తీసుకురానున్న‌ది.  ఈ బ‌స్సు బ్యాట‌రీని ఒక‌సారి రీఛార్జ్ చేస్తే గ‌రిష్టంగా 400 కిమీ దూరం ప్ర‌యాణం చేయ‌వ‌చ్చిన సంస్థ తెలియ‌జేసింది.  

Read: వెనక్కి త‌గ్గ‌ని కిమ్‌: ఆ దేశ‌మే ల‌క్ష్యంగా బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం…

Exit mobile version