వెనక్కి త‌గ్గ‌ని కిమ్‌: ఆ దేశ‌మే ల‌క్ష్యంగా బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం…

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ అణ్వాయుధ క్షిప‌ణుల ప్ర‌యోగాల విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇటీవ‌లే హైప‌ర్ సోనిక్ క్షిప‌ణిని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించిన ఉత్త‌ర కొరియా తాజాగా మ‌రో బాలిస్టిక్ క్షిప‌ణిని ప్ర‌యోగించింది.  మంగ‌ళ‌వారం ఉద‌యం ఉత్త‌ర కొరియా తూర్పుతీరంలో ఈ క్షిప‌ణిని ప్ర‌యోగించింది జ‌పాన్‌కు షాక్ ఇచ్చింది.  జ‌పాన్ ల‌క్ష్యంగా చేసుకొని ఈ క్షిప‌ణిని ప్ర‌యోగించిన‌ట్టు స‌మాచారం.  అంత‌ర్జాతీయ ఆంక్ష‌ల‌ను ఏ మాత్రం ఖాత‌రు చేయకుండా కిమ్ అణ్వ‌స్త్ర ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకుంటున్నారు.  ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్‌లో ఆయుధాల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతున్న స‌మ‌యంలో కిమ్ బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం చేప‌ట్ట‌డం ఆందోళ‌న క‌లిగించే అంశంగా మారింది.  త‌మ ర‌క్ష‌ణ కోస‌మే ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకుంటున్నామ‌ని ఉత్త‌ర కొరియా స్ప‌ష్టం చేసింది.  

Read: అద్భుతం: ఆవాల నుంచి విమాన ఇంధ‌నం…

Related Articles

Latest Articles