అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్ ఆటలో ప్రతిష్టాత్మక బాలన్ డార్ అవార్డును ఏడుసార్లు అందుకుని మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన కోపా అమెరికా టోర్నీలో 34 ఏళ్ల మెస్సీ తమ దేశ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీ ఫైనల్‌లో బ్రెజిల్‌పై అర్జెంటీనా 1-0 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ మెగా టోర్నీ టైటిల్ అందించాడు.
Read Also: వైరల్.. భారతీయుల టాలెంట్‌పై టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్వీట్
మరోవైపు 2021లో అత్యధికంగా మెస్సీ 40 గోల్స్ చేశాడు. బార్సిలోనా తరఫున 28, సెయింట్ జెర్మైన్‌కు నాలుగు, అర్జెంటీనాకు 8 గోల్స్ చేశాడు. ఈ నేపథ్యంలో బాలన్ డార్ అవార్డు కోసం మెస్సీ పోటీ పడ్డాడు. బాలన్ డార్ అవార్డు ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 మంది జర్నలిస్టులు ఓటింగ్‌లో పాల్గొంటారు. ఈ అవార్డు కోసం 30 మంది ఆటగాళ్లు పోటీ పడగా… రాబర్ట్ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి దీనిని మెస్సీ గెలుచుకున్నాడు. అంతకుముందు 2009, 2010, 2011, 2012, 2015, 2019లోనూ మెస్సీ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. కరోనా కారణంగా 2020లో ఈ అవార్డుల కార్యక్రమం జరగలేదు.
