Site icon NTV Telugu

దాచేపల్లి వైసీపీలో ఫ్లెక్సీ రగడ.. జంగా వర్సెస్ కాసు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవానికి అంతా సిద్ధం అయింది. వైసీపీ నేతలు ఎవరికి వారు తమదైన రీతిలో తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు రెడీ అయ్యారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య వైరం రోడ్డున పడింది. గుంటూరు జిల్లా దాచేపల్లి వైసీపీలో ఫ్లెక్సీ వివాదం చినికి చినికి గాలివానగా మారింది.

వివాదానికి కారణమయిన ఫ్లెక్సీ ఇదే..

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్గీయులు. గామాలపాడు సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా ఫ్లెక్సీలు వేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గం.జగన్ పుట్టినరోజు సందర్భంగా అదే ఫ్లెక్సీల స్థానంలో జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ కట్టారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్గీయులు. దీంతో వివాదం రేగింది. ఎమ్మెల్సీ జంగా వర్గీయుల ఫ్లెక్సీ తొలగించడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

https://ntvtelugu.com/ysrcp-leaders-special-arrangements-for-jagan-birthday/
Exit mobile version