NTV Telugu Site icon

రైతు ఉపాయం: పక్షులు ప‌రార్‌…

పంట పొలాల‌పై నిత్యం పక్షులు దాడిచేసి పంట‌ను తినేస్తుంటాయి.  వాటి నుంచి కాపాడుకోవ‌డానికి పొలంలో రైతులు దిష్టిబొమ్మ‌లు, ఎర్ర‌ని గుడ్డ‌లు వంటిని ఏర్పాటు చేస్తుంటారు.  లేదంటే డ‌ప్పుల‌తో సౌండ్ చేస్తుంటారు.  అయితే, 24 గంట‌లు పొలంలో ఉండి వాటిని త‌రిమేయాలి అంటే చాలా క‌ష్టం.  దీనికోసం ఓ రైతు వేసిన పాచిక పారింది.  పక్షులు ప‌రార్ అయ్యాయి.  ఆ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం.  మాములు ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్‌ తీసుకొని దాని రెక్క‌లు తొల‌గించాడు.  రెక్క‌లు తీసేసిన త‌రువాత దానిని పొలంలో ఓ దూలానికి వేలాడ‌దీసి, ఆ ఫ్యాన్‌కు ఓ చైన్‌ను క‌ట్టాడు.  దాని ప‌క్క‌నే ఓ రేకు పాత్ర‌ను అమ‌ర్చాడు.  ఫ్యాన్ తిరుగుతున్నంత సేపు ఆ చైన్ రేకు పాత్ర‌కు త‌గిలి సౌండ్ చేస్తుంది.  ఆ సౌండ్‌కు ప‌క్షులు పొలంలోకి రాకుండా పారిపోతున్నాయి. ప‌క్షులు మాత్ర‌మే కాదు, ఆ పొలంలోకి ఏ జంతువులు కూడా రావ‌డంలేద‌ట‌.  దీంతో ఆ రైతు ఖుషీ అవుతున్నాడు.  దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

Read: మొక్క‌లు కూడా ఎంచ‌క్కా మాట్లాడుకుంటాయ‌ట‌… ఎలానో తెలుసా?