NTV Telugu Site icon

Fallen Pine Trees: గోల్ఫ్ టోర్నీలో కూలిన పైన్ చెట్లు.. ప్రేక్షకులలో గందరగోళం

Fallen Pine Trees

Fallen Pine Trees

కొన్నిసార్లు ప్రమాదాలు చాలా అనుకోకుండా జరుగుతాయి. కొన్నిసార్లు ప్రమాదాలు సమీపంలో పొంచి ఉంటాయి. కొండచరియలు విరిగిపడటం, ఒక్కసారిగా వంతెనలు కూలిపోవడం.. గోడలు కూలిపోవడం..భారీ వృక్షాలు కూలిపోవడం.. చెట్లు కూలడం వంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే, గోల్ఫ్ టోర్నమెంట్‌లో పైన్ చెట్లు పడిపోయిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read:KTR Tweet: గవర్నర్ తీరుపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

2023 మాస్టర్స్ టోర్నమెంట్ అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో జరుగుతోంది. గోల్ఫ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సీటింగ్ ఏరియాలో మూడు పైన్ చెట్లు నేలకొరిగాయి. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి అక్కడున్న వారంతా బయటపడ్డారు. వెంటనే టోర్నీని వాయిదా వేశారు.

మూడు పైన్ చెట్లు నేరుగా ది అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద కూర్చునే ప్రదేశంలోకి పడిపోయాయి. ఇది ప్రేక్షకులలో గందరగోళం మరియు భయాందోళనలకు కారణమైంది. అదృష్టవశాత్తూ, ఎవరూ గాయపడలేదు. టోర్నమెంట్ నిర్వాహకులు ఈవెంట్‌కు హాజరైన ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు.
Also Read:live life comfortably: ఆ దేశంలో అన్నీ ఉచితమే.. జీవితాన్ని హాయిగా గడపండి

ఒకదానికొకటి చిక్కుకున్న పైన్ చెట్లు నెమ్మదిగా పడిపోయాయి. దీంతో అక్కడున్న వారందరినీ అప్రమత్తం చేశారు. పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. టోర్నీ ఎప్పుడు జరిగినా అక్కడి వాతావరణం, పరిస్థితులను నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని టోర్నీ నిర్వాహకులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.