ఫేస్‌బుక్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యక్తిగత గోప్యత తదితర విషయాలపై అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ కీలక ఫేస్ రికగ్నైషన్ ఆప్షన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఫేస్ ప్రింటర్లను సైతం తొలగిస్తున్నట్టు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తెలియజేసింది. అపరిమిత వినియోగం నుంచి వినియోగాన్ని పరిమితం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెటా తెలియజేసింది.
Read: దీపావళి వేళ ప్రజలకు ఊరట… తగ్గిన వంటనూనెల ధరలు
ఈ ఆప్షన్‌ను తొలగించడం వలన దీని ప్రభావం బిలియన్ మందిపై పడే అవకాశం ఉన్నది. ఫేస్ రికగ్నైషన్ ఆప్షన్‌ను తొలగించడం వల్ల ఇకపై ఫొటోల్లోని వ్యక్తులను గుర్తించడం, ఆ వ్యక్తులను సూచించడానికి, వారి పేరుతో ట్యాగ్ చేయడానికి కుదరదు. ఫేస్ రికగ్నైషన్ వల్ల ఫేస్‌బుక్‌కు భవిష్యత్తులో పెద్ద ఎత్తున సాంకేతికంగా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచించడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. 2010 నుంచి అందుబాటులో ఉంచిన ఈ ఆప్షన్‌ను ఇప్పుడు తొలగించడంతో యూజర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.