తాలిబన్లకు షాకిచ్చిన ఫేస్బుక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌లో తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకుని.. వరుసగా అన్ని ప్రభుత్వ సముదాయాలపై జెండా పాతేస్తున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు తాలిబన్ల మూమెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సమాచారం సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది.. తాలిబన్లకు సంబంధించిన ఏ సమాచారానికి తమ వేదికలో స్థానం లేదని స్పష్టం చేసింది. తమ సేవలు వినియోగించుకునే అవకాశం లేకుండా తాలిబన్లపై నిషేధం విధించినట్టు ప్రకటించింది ఎఫ్బీ.. ఇప్పటికే తాలిబన్లకు సంబంధించిన ఖాతాలను తొలగించినట్టు వెల్లడించింది..
అయితే, దీనికి ప్రధానం కారణం.. అమెరికా ప్రభుత్వం తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొనడమే అంటోంది ఫేస్బుక్.. ఇకపై తాలిబన్లకు సంబంధించిన సమాచారంపై ఓ కన్నేసి ఉంచుతామని.. దానికోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది ఫేస్బుక్.. ఆఫ్ఘానీ భాషలైన డారీ, పాష్తోలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులను ఆ స్పెషల్ టీమ్‌లో సభ్యులుగా చేర్చింది. స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న వీరు.. ఫేస్బుక్లో తాలిబన్లకు సంబంధించిన సమాచారం కోసం జల్లెడపడుతూ.. సంస్థను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు.. మొత్తంగా.. తాలిబన్లకు సంబంధించిన ఏ ఒక్క సమాచారాన్ని కూడా ఫేస్బుక్ వేదికగా పంచుకునే వీలులేకుండా చర్యలకు పూనుకుంది.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
తాజావార్తలు
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!