Site icon NTV Telugu

ఒమిక్రాన్ వేరియంట్‌ల‌ను క్లాట్ మాస్క్‌లు అడ్డుకోగ‌ల‌వా?

ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది.  కేసులు భారీగా పెరుగుతున్నాయి.  కేసులు పెరిగిపోతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  అనేక దేశాల్లో తిరిగి ఆంక్ష‌లు విధించారు.  కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌ను బ్యాన్ చేశారు.  రోజు రోజుకు భారీ సంఖ్య‌లో కేసులు పెరుగుతున్నాయి.   బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేశాయి వివిధ దేశాలు.  అయితే, వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్‌ను గుడ్డ‌తో త‌యారు చేసిన మాస్క్‌లు ఎంత‌వ‌రకు నిలువ‌రించ‌గ‌లుగుతాయి అనే దానిపై ప్ర‌స్తుతం ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  

Read: లైవ్‌: నాని వ్యాఖ్యలపై నట్టి కుమార్ కౌంటర్

రెండు మూడు పొర‌లు ఉండే మాస్క్‌లు ఒమిక్రాన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటాయని ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం పేర్కొన్న‌ది.  అయితే, మాస్క్‌ల‌ను అలంక‌ర‌ణ వ‌స్తువుగా వాడుకుంటున్నార‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  మెడికేటెడ్‌గా వినియోగించే ఎన్ 95 మాస్క్‌లు వైర‌స్‌ల‌ను ఎంత వ‌ర‌కు నిలువ‌రించగ‌లుగుతాయి టెస్ట్ చేయాల్సి ఉంటుంది.  మాస్క్ ప‌నితీరు ఎంత గొప్ప‌గా ఉన్నా, ముక్కు, నోటిని స‌రిగ్గా మూసివేయ‌కుంటే దాని ఫ‌లితం ఉంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

Exit mobile version