Site icon NTV Telugu

కెసిఆర్ పై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు : నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..

సిఎం కెసిఆర్ జమున హేచరిస్ అధినేత ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై నెల రోజుల నుండి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని.. వాటిని ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు అని ఫైర్ అయ్యారు. మేము ఏ రోజు కూడా తప్పు చేయలేదని..మసాయిపేట్ లో 46 ఎకరాలు కొన్నది వాస్తవమని..బడుగు, బలహీన వర్గాల నుంచి మేము భూములు తీసుకుంటామా? అని ప్రశ్నించారు. మేము కొన్న భూమి కన్నా ఒక్క ఎకరం ఎక్కువ ఉన్న ముక్కు నేలకు రాస్తానని..నిరూపించకపోతే అధికారులు ముక్కు నేలకు రాస్తారా..? అని సవాల్ విసిరారు. దేవర యాంజల్ లో 1994లో మూడో తరం దగ్గర భూమి కొన్నామన్నారు. మా 6 ఎకరాల భూమి కుదువపెట్టి నమస్తే తెలంగాణ పేపర్ కు డబ్బులు ఇచ్చామని పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ కు న్యాయం ధర్మం లేదు.. ఆయనకి ఏది కావాలి అంటే అది అప్పుడే కావాలని మండిపడ్డారు. కుల రహిత సమాజం కోసమే మేము పెళ్ళి చేసుకున్నామని..తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏ రోజు సంతోషంగా లేము….ప్రతి రోజూ అవమానలేనని ఆరోపణలు చేశారు. ఈటలను ప్రగతిభవన్ కు రానీయక పోతే మూడు సార్లు ఇంటికి వచ్చి ఏడ్చారని..తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని మా ఆయనకు చెబుతా అని పేర్కొన్నారు. నా ఆస్తులు అన్ని అమ్మి మా ఆయనకు ఇస్తా అని వెల్లడించారు ఈటెల జమున.

Exit mobile version