దేవన్నపేట లోని విజయ గర్జన సభా పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేలు అరూరి రమేష్.. ధర్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కడియం శ్రీహరి. బీజేపీతో గొడవ పెట్టుకోవాలని అనుకోలేదని, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినందుకే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి. ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేవరకు టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. పార్టీ విజయగర్జన సభకు ప్రజలంతా ఉప్పెనలా తరలిరావడానికి సిద్ధంగా వున్నారు. 12లక్షల మంది సభకు హాజరవుతారు. ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 300 ఎకరాల్లో విజయ గర్జన సభ. 1500 ఎకరాల్లో పార్కింగ్ వుంటుందన్నారు. సభా ప్రాంగణం వద్ద మరో 100 ఎకరాలు సేకరిస్తున్నామన్నారు. సభ నిర్వహణకు స్థలాలు ఇచ్చిన దేవన్నపేట, కోమటిపల్లి రైతులకు కృతజ్ఞతలు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కు వస్తున్నారన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు, హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12వ తేదీన ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో మహా ధర్నాలు విజయవంతం చేయాలన్నారు.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తాయన్నారు. రైతు చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని, ఇవే డిమాండ్లతో కేంద్రంపై పోరాటం చేస్తున్నామన్నారు.
