Site icon NTV Telugu

పిల్ల‌లు పుట్ట‌ర‌ని ఆ ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకోవ‌డం లేద‌ట‌…!!

వ్యాక్సిన్ పై ప్ర‌పంచ దేశాల్లో ఇప్ప‌టికీ అనేక అనుమానాలు, అపోహ‌లు ఉన్నాయి.  వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యం చెడిపోతుంద‌ని, పిల్ల‌లు పుట్ట‌ర‌నే అపోహ‌లు చాలా మందిలో ఉన్నాయి.  మారుమూల ప్రాంతాల్లో అంటే స‌రిలే అనుకోవ‌చ్చు.  కానీ, అభివృద్ది చెందిన ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి సందేహిస్తున్నారు.  లండ‌న్‌లో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

Read: తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు న‌మోదు

ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఇంగ్లీష్ ప్రీమియం ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి.  ఈ మ్యాచ్‌ల‌లో పాల్గొనే క్రీడాకారుల్లో కేవ‌లం 68 శాతం మంది మాత్ర‌మే వ్యాక్సిన్ తీసుకున్నారు.  మిగ‌తా వాళ్ల‌ను వ్యాక్సిన్ తీసుకోమంటే వివిధ ర‌కాల కార‌ణాలు చెబుతున్నారు.  అందులో కొంద‌రు చెబుతున్న కార‌ణాలు చాలా సిల్లీగా ఉండ‌టంతో అధికారులు షాక్ అవుతున్నారు.  వ్యాక్సిన్ తీసుకుంటే పిల్ల‌లు పుట్ట‌ర‌నే భ‌యంతో తీసుకోబోమ‌ని చెప్పి మొండికేస్తున్నార‌ట‌.  ఈ స‌మాధానాలు విన్న అధికారులు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Exit mobile version