ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన చేష్టలతో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అంగారకుడిపై మనిషిని పంపడమే లక్ష్యంగా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ పనిచేస్తున్నది. 2002లో మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థను నెలకొల్పాడు. నాసాతో కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నది ఈ సంస్థ. స్పేస్ ఎక్స్ సంస్థ 100 మెట్రిక్ టన్నులు మోసుకెళ్లే సామర్థ్యంతో కూడిన స్టార్ షిప్ ను తయారు చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ స్టార్ షిప్ భూమినుంచి అంగారకుడి మీదకు మనుషులను తీసుకెళ్లనుంది. అయితే, తాజాగా ఎలన్ మస్క్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.
Read: బీఎండబ్ల్యూ ఐఎక్స్ రికార్డ్… తొలిరోజే…
వాతావరణం నుంచి కార్భన్‌డైఆక్సైడ్‌ను బయటకు తీసి రాకెట్ ఇంధనంగా మార్చుకునేలా ప్రయోగాలు చేస్తున్నట్టు తెలిపారు. అంగారకుడిపై ఈ విధంగా చేయడం చాలా అవసరం ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మస్క్ ఏదైనా సాధించగలడని, తప్పకుండా మస్క్ చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.